ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కైకలూరు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ పదవికి జయమంగళ వెంకటరమణ శనివారం రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీకి చేసిన రాజీనామా లేఖను జగన్కు ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామా లేఖను శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజుకు పంపించారు. అలాగే తన రాజీనామాలను ఆమోదించాలని ఆయన లేఖల్లో కోరారు.