పుస్తక పఠనం ప్రతి ఒక్కరినీ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని, ఆ అనుభూతుని ఆస్వాదించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. గురువారం ఆయన మచిలీపట్నంలోని కలెక్టరేట్లోని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మందిరంలో కలిసి రెండు బీరువాలతో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. పండుగల సమయంలో పుష్పగుచ్చాలు, మొక్కలు, స్వీట్స్, శాలువాలకు బదులుగా ఉపయోగపడే మంచి పుస్తకాలను కానుకగా అందించాలన్నారు.