కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు ఆదేశాలతో జిల్లా అడిషనల్ ఎస్పీ వివి. నాయుడు, బందరు డిఎస్పీ ఎండి. అబ్దుల్ సుభాన్ సైబర్ నేరాల నివారణకు బ్యాంకర్లతో మచిలీపట్నంలో ప్రత్యేక సమావేశం శుక్రవారం నిర్వహించారు. డిజిటల్ అరెస్టులు, సైబర్ మోసాలు, ఆర్థిక నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల ద్వారా ప్రజలు భారీ మొత్తంలో డబ్బు కోల్పోతున్నారని, ఏపీలో ఈ ఏడాది రూ. 800 కోట్లు నష్టపోయినట్టు వివరించారు.