మచిలీపట్నం ప్రభుత్వ సరోజన ఆసుపత్రి నిర్వహణలో మార్పు కనపడాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర వైద్యాధికారులను, పర్యవేక్షకులను ఆదేశించారు. గురువారం రాత్రి మచిలీపట్నంలో మంత్రి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, వైద్య కళాశాల పనితీరు తెన్నులపై సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పారిశుధ్యం అధ్వానంగా ఉందన్నారు.