ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన కలెక్టర్ సృజన

82చూసినవారు
ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన కలెక్టర్ సృజన
ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి మార్కెట్ యార్డులో భద్రపరిచిన ఈవీఎంల గోడౌన్‌ను కలెక్టర్ జి. సృజన శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా, ఈవీఎంల రక్షణకు గోడౌన్ వద్ద ఉన్న సీల్లు, భద్రతా ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఇక్కడ విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్