నందిగామ పట్టణంలో స్థానిక తంగిరాల సౌమ్య ఆదేశాల మేరకు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లీగల్ సెల్ కార్యదర్శి, లాయర్ కరీముల్లా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిడిపి సభ్యత్వ నమోదులో ప్రజలు భారీగా నమోదు చేసుకోవడం పట్ల నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.