స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నూజివీడులో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఈ మేరకు ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దిశగా ఈ నెల 20న నూజివీడులోని త్రిబుల్ ఐటీ క్యాంపస్ లోని స్టూడెంట్ ఆక్టివిటీ సెంటర్ ఆడిటోరియంలో ఈ మేళాను చేపట్టనున్నారు. కావున నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.