నందిగామలో భారీ అగ్ని ప్రమాదం

11308చూసినవారు
నందిగామలో భారీ అగ్ని ప్రమాదం
ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని పాత బస్టాండ్ లో శ్రీబాలాజీ డోర్స్ అండ్ ప్లేవుడ్ షాప్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలిసింది. భారీ ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జ‌రిగిన‌ట్టు సమాచారం. ఘటనా స్థలానికి 3 ఫైర్ ఇంజిన్లు చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. రూ. 80 లక్షల నుండి రూ. కోటి వరకు ఆస్తి నష్టం. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్