ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడడంలో భారత రాజ్యాంగానిదే కీలక పాత్ర అని పామర్రు నియోజకవర్గం శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగ నిర్మాతలైన బిఆర్ అంబేద్కర్, న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణులు, స్వాతంత్ర సమరయోధుల సేవలను స్మరించుకోవడం కర్తవ్యమని శాసనసభ్యులు కుమార్ రాజా పేర్కొన్నారు.