రైతులకు న్యాయం చేయకపోతే పామర్రు నియోజకవర్గ స్థాయి రైతులు తరఫున ధర్నా చేస్తామని పామర్రు మాజీ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ హెచ్చరించారు. శుక్రవారం తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి పాలనలో మిల్లర్లు, దళారులకు అనుకూలంగా నిబంధనలు ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.