వర్షాలు ఆగాయి, వరదలు తగ్గాయి, సామాన్యుడికి కష్టాలు పెరిగాయి. వరద నష్టం కూరగాయలపై పడింది. దీంతో పామర్రు నియోజకవర్గంలో మరోసారి కూరగాయల ధరలు కొండెక్కాయి. సామాన్యులు కొనే పరిస్థితి లేకుండా పోతుంది. భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల పంట నష్టపోవడంతో దిగుబడి తగ్గింది. దీంతో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు సెంచరీకి చేరువయ్యాయి.