ఏలూరుపాడులో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ బ్యానర్లు తొలగించినందుకు సోమవారం పామర్రు, తోట్లవల్లూరుల్లో దళితులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ప్రదర్శనగా వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉండి శాసనసభ్యుడు రఘురామ కృష్ణంరాజును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు చిత్రపటాలను అంబేద్కర్ యువసేన చెప్పులతో కొట్టారు.