ప్రజలు ధైర్యంగా వారికున్న భూ సమస్యలను చెప్పాలని ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి అన్నారు. మంగళవారం తొట్లవల్లూరులో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ రెవెన్యూ సదస్సులో మండల రెవెన్యూ అధికారి సుమా కుమారితో ఆయన కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు పంపించారు.