Sep 13, 2024, 09:09 IST/
సీనియర్ సిటిజన్ల కోసం పోస్టాఫీస్‌లో అదిరిపోయే స్కీమ్
Sep 13, 2024, 09:09 IST
సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం.. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)ని అమలు చేస్తుంది. బ్యాంకులో గాని, పోస్టాఫీసులో గాని 55-60 ఏళ్ల VRS తీసుకున్న వ్యక్తులు ఈ ఖాతాను తెరవవచ్చు. కనిష్టంగా రూ.1000తో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. 8.2% వడ్డీరేటును అందిస్తుంది. దీనికి మెచ్యూరిటీ వ్యవధి 5 ఏళ్లు. ఈ పథకంలో ఒక వ్యక్తి రూ. 30 లక్షలు పెట్టుబడి పెడితే, అతనికి రూ. 2.46 లక్షల వార్షిక వడ్డీ లభిస్తుంది. ఇది ప్రతి నెలా దాదాపు రూ. 20,500 గా వస్తుంది.