పింఛనుదారులు వార్షిక ధృవీకరణ పత్రములు నిర్ణీత గడువులోపు మాత్రమే సమర్పించాలని బంటుమిల్లి ఉప ఖజానా అధికారి కె. గోపికృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పింఛనుదారులు వార్షిక ధృవీకరణ పత్రమును (యాన్యూవల్ వెరిఫికేషన్ లైఫ్ సర్టిఫికెట్ ) జనవరి 2025 నుండి ఫిబ్రవరి 28 2025 లోపు మాత్రమే సమర్పించాలని ఉప ఖజానా అధికారి గోపికృష్ణ స్పష్టం చేశారు.