పెడన మండలం జింజేరు గ్రామంలో జరిగిన వినాయక నిమజ్జనోత్సవంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం సాయంత్రం నిమజ్జన ఊరేగింపులో హిజ్రాలతో డాన్స్ వేయిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కార్యక్రమాలను నిలుపుదల చేశారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు ధర్నాకు దిగారు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని వివాదాన్ని సర్దుబాటు చేసినట్లు సమాచారం.