నూతన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పురపాలక సంఘాలకు మంచి రోజులు ప్రారంభమాయ్యని రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు అన్నారు. సోమవారం పెడనలో ఆయన మాట్లాడుతూ పెడన పురపాలక సంఘంలో వివిధ పథకాల స్థిగతులను ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాబోవు కాలం వరకు మంచినీటి కష్టాలు రాకుండా ఉండటానికి ఏఐఐబి ద్వారా పెడన పట్టణంలో మంచినీటి పథకానికి కృషి చేయడం జరిగిందన్నారు.