సమస్యల పరిష్కారం కోసమే గ్రామ సభ నిర్వహిస్తున్నట్టు తహసీల్దార్ రాజ్యలక్ష్మి అన్నారు. గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలో శనివారం రెవెన్యూ గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ భూ సమస్యలు ఉన్న రైతుల నుంచి అర్జీలు స్వీకరించారు. గ్రామసభలో వచ్చిన అర్జీలను పరిశీలించి వెంటనే వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.