కృష్ణాజిల్లా రేషన్ డీలర్ల సంఘం ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 11. 32 లక్షల రూపాయల నిధులు అందించినట్లు కృష్ణాజిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు పుప్పాల సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన కృత్తివెన్నులో వివరాలను తెలియజేశారు. అక్టోబర్ నెలలో బుడవేరు వరద నేపథ్యంలో రేషన్ డీలర్ల కమిషన్ 75 లక్షలు రాగా, రూ. 11. 32 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించినట్లు సుబ్రహ్మణ్యం తెలిపారు.