తెలుగు ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండుగ అయిన సంక్రాంతి పండుగ వేడుకలు గ్రామాల్లో ఘనంగా జరుగుతున్నాయి. భోగి సందర్బంగా పెడన పట్టణంలోని మైదానంలో వందలాది మంది చిన్నారులు పతంగులు ఎగరవేసి సందడి చేశారు. వీటిని వీక్షించేందుకు గ్రామంలోని పలువురు ప్రముఖులతో పాటు మహిళలు చిన్నారులు వచ్చారు. ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా తల్లిదండ్రులు సూచనలతో చిన్నారులు పతంగులను ఎగరవేసి సందడి చేశారు.