పెడన నియోజకవర్గం కమలాపురం వంతెన దగ్గర రోడ్డు రెండు వైపులా భారీగా కృంగింది. రహదారి భారీగా కోతకు గురి కావడంతో ప్రమాదానికి నెలవుగా మారింది. రాత్రి వేళల్లో వాహనదారులు ఆదమరిచి ప్రయాణం సాగిస్తే ఆసుపత్రిలో చేరడం ఖాయమని ప్రజలు వాపోతున్నారు. వంతెన రహదారి భారీగా కోతకు గురైన ఆర్ అండ్ బి అధికారులు స్పందించడం లేదని ప్రజలు వాపోతున్నారు. తక్షణమే అధికారులు స్పందించే తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.