పెడన మండలం చోడవరం సచివాలయంలో పనిచేస్తున్న ఎం. ఎల్. హెచ్. పి సుజాత శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 ఫోన్ చేసి మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రి కి తరలించారు. నడుపూరు - కొత్తపల్లి ఆర్ అండ్ బి రోడ్డు గోతులు మయం కావడంతో ప్రతి రోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు భయపడుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి రోడ్లు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.