లోతట్టు ప్రాంతాలు మునక

82చూసినవారు
లోతట్టు ప్రాంతాలు మునక
కుండపోత వర్షానికి కంకిపాడు మెయిన్ రోడ్డు, బస్టాండ్ తోపాటు పలు ప్రాంతాలు నీట మునిగాయి. కంకిపాడులో 170 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు గురువారం అధికారులు తెలియజేశారు. కంకిపాడు మెయిన్ రోడ్డు వర్షపు నీటితో నిండి పోవడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కంకిపాడు మండల పరిధిలోని దావులూరు, నెప్పల్లి, కోలవెన్ను, కుందేరు, పునాదిపాడు గ్రామాలలోని పంట పొలాలు నీట మునిగాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్