పింఛనుదారులు వార్షిక ధృవీకరణ పత్రములు నిర్ణీత గడువులోపు మాత్రమే సమర్పించాలని ఉయ్యూరు ఉప ఖజానా అధికారి ఆకూరి శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పింఛనుదారులు వార్షిక ధృవీకరణ పత్రమును జనవరి 1, 2025 నుండి ఫిబ్రవరి 28, 2025 లోపు మాత్రమే సమర్పించాలని ఆ ప్రకటనలో ఉప ఖజానా అధికారి ఆకూరి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.