పెనమలూరు: న్యాయం చేసేందుకు కృషి చేస్తా

62చూసినవారు
పెనమలూరు: న్యాయం చేసేందుకు కృషి చేస్తా
ఉయ్యూరు హనుమాన్ నగర వాసులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని మాజీ శాసనమండలి సభ్యులు వైవిబి రాజేంద్రప్రసాద్ హామీ ఇచ్చారు. ఉయ్యూరు నగర పంచాయితీ పరిధిలోని 16వ వార్డులోని హనుమాన్ నగర్ వాసులు తమ ఆస్తులు స్థలాలను 22ఏ జాబితా నుండి తొలగించవలసినదిగా కోరుతూ ఆదివారం రాజేంద్రప్రసాద్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమాన్ నగర్ వాసుల వినతులను పరిష్కరించడం కోసం కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్