లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ ఫ్యాకెట్లు పంపిణీ
లయన్స్ క్లబ్ ఆఫ్ కంకిపాడు ఆధ్వర్యంలో గురువారం మజ్జిగ ఫ్యాకెట్లును పంపిణీ చేశారు. క్లబ్ ట్రెజరెరీ, రియల్ ఎస్టేట్ వ్యాపారి వన్నాల రామకృష్ణ వితరణతో 'మజ్జిగ ఫ్యాకెట్లును అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ మానవతా దృక్పథంతో మజ్జిగ ఫ్యాకెట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు కంకిపాటి మల్లేశ్వరరావు, సీనియర్ లయన్ మద్దుల గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.