పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు నగర పంచాయతీ కేంద్రంగా యదేచ్ఛగా ఇసుక డంపింగ్ జరుగుతోంది. ఉచిత ఇసుక విధానం పై ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్న గుట్టుచప్పుడు కాకుండా శనివారం అక్రమ మార్గాల్లో ఎడ్లబండ్లపై ఇసుక తీసుకువచ్చి ఉయ్యూరు పరిసర ప్రాంతాల్లో డంపింగ్ చేసి వాటిని లారీలలో తరలిస్తూ అక్రమ వ్యాపారానికి తెరలేపారు.