విస్సన్నపేటలో గ్రామ దేవత ముత్యాలమ్మ అమ్మవారికి సుదీర్ఘకాలంగా ఆనవాయితీగా వస్తున్న ఆషాడ సారేను వాసవి మాత బిడ్డలు ఆర్యవైశ్య ఆడపడుచులు శుక్రవారం అందించారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన ముత్యాలమ్మ అమ్మవారికి ప్రముఖులు కుక్కడపు వెంకట నాగేశ్వరరావు రత్నకుమారి దంపతులు భక్తిశ్రద్ధలతో వేదపండితులు నిర్ణయించిన బ్రహ్మ ముహూర్తంలో మంగళ వాయిద్యాలతో భారీ ఊరేగింపుగా తరలి వెళ్లి ఆషాడ సారెను సమర్పించారు.