రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి భేటీ అయ్యారు. రాష్ట్రంలో దేవాలయ ట్రస్ట్ బోర్డ్ పదవి కాలం ముగిసి నెలలు గడుస్తోందని, వెంటనే నియామకాలు పూర్తి చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు. ఇటీవల తిరువూరులో పర్యటించిన మంత్రి వెల్లంపల్లి కోకిలంపాడులో దేవాలయం నిర్మాణానికి తగిన నిధులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.