ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం(మ), నెమలి గ్రామంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గురువారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీ బీసీ కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనాన్ని విద్యార్థులతో కలిసి రుచి చూశారు. ప్రభుత్వ పాఠశాలలో పోషక ఆహారాన్ని ప్రభుత్వం అందిస్తుందని విద్యార్థులకు సూచించారు.