గంపలగూడెం మండలం పెనుగొలనులో శుక్రవారం షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులుతెలుగు కవులు చిత్రపటాలు పట్టుకొని ప్రదర్శన నిర్వహించారు. తెలుగు భాష గొప్పతనాన్ని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. లీలా శంకర్ వివరించారు. సాయిబాబా కమిటీ అధ్యక్షుడు వి. నారాయణ రావు, విశ్రాంత ప్రిన్సిపాల్ వి. వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.