ఎన్టీఆర్ జిల్లా తిరువూరునియోజకవర్గం విసన్నపేటలో ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్భంగా జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల పోలింగ్ సెంటర్ ఆర్డిఓ మాధురి మంగళవారం పరిశీలించారు. అనంతరం ప్రభుత్వం పిల్లలకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం పథకం అమలు ఎలా జరుగుతుందో ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారో లేదో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆమె విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు.