తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలపై టీటీడీ ఆంక్షలు విధించడం ఎంతమాత్రం సరికాదని శుక్రవారం విజయవాడ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఒక భక్తుడికి రెండుమాత్రమే లడ్డూలు ఇచ్చేలా రూల్స్ మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ నూతన విధానాలపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం సామర్థ్యం పెంచుకుంటూ పోవాల్సింది.