రాష్ట్ర ప్రజలను అన్నివిధాలా మోసగిస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈనెలలో పోరాటాలకు సిద్ధమైందని పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనం నందు బుధవారం గోడపత్రికలను ఆవిష్కరించారు. ఎన్నికలకు ముందు ఓ మాట, ఎన్నికల తర్వాత మరోమాట చెప్పడం చంద్రబాబుకి కొత్తేమీ కాదని ఈ సందర్భంగా మల్లాది విష్ణు విమర్శించారు.