విజయవాడ: వాగు పొంగి.. రాకపోకలకు అంతరాయం

63చూసినవారు
విజయవాడ: వాగు పొంగి.. రాకపోకలకు అంతరాయం
విజయవాడ పరిసర ప్రాంతాలు, ముఖ్యంగా గంపలగూడెం మండలం వినగడప వద్ద శనివారం కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కట్టెలేరు వాగుకు భారీగా వరద నీరు చేరడంతో ఆదివారం ఉప్పొంగి ఉధృతంగా ప్రవహించింది. ఈ పరిస్థితిలో తోటమూల-వినగడప మధ్య వంతెనపై వరద నీరు పోటెత్తింది. కాగా 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు 40 కిలో మీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తోంది.
పోలీసులు వంతెన వద్ద పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్