విజయవాడ కృష్ణలంక, నెహ్రూనగర్ డొంక రోడ్ నుండి గడప గడపకు 'మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమాన్ని దేవినేని అవినాష్ మంగళవారం నిర్వహించారు. డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ స్థానిక కార్పోరేటర్ అడపాశేషుతో కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోడ్డు నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసారు.