బెజవాడలో నకిలీ మందులను సీజ్ ‌చేసిన డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు

364చూసినవారు
బెజవాడలో నకిలీ మందులను సీజ్ ‌చేసిన  డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు
బెజవాడలో భారీగా నకిలీ మందులు బయటపడ్డాయి. వన్‌టౌన్‌, గొల్లపూడిలోని హోల్‌సేల్‌ మందుల దుకాణాల్లో గురువారం డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ.లక్షల విలువ చేసే నకిలీ మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్రాండెడ్‌ పేరుతో నకిలీ మందులు విక్రయిస్తున్నట్టు గుర్తించారు.హోల్‌సేల్‌ వ్యాపారులు బిల్లులు లేకుండా హైదరాబాద్‌ నుంచి ఈ ఔషధాలను తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు తెలిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్