ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా నిరసనలు తెలపబోతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఏఈ, డిఈలకు మెమరండంలు ఇచ్చి నిరసనలు తెలియజేస్తామన్నారు. సబ్ స్టేషన్ ల వద్దకు వెళ్లి నిరసన కార్యక్రమాలు చేపడుతమని అవినాష్ తెలియజేశారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అమలు చేస్తామన్న సంక్షేమ పథకాలు ఇవ్వడంలో విఫలమైందన్నారు.