ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ గాయత్రీ దేవి అలంకృత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖా మంత్రి టీజీ భరత్ దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వదించి అమ్మవారి శేష వస్త్రం, ప్రసాదం, చిత్ర పటాన్ని భరత్ కు అందజేశారు.