చెన్నై నుంచి విజయవాడ వెళ్ళే పినాకిని ఎక్స్ప్రెస్లో ముగ్గురు యువకులు ఒక మహిళకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి, ఆమె స్పృహ తప్పగానే 10 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను దోచుకున్నారు. కాగా రైలు ఒంగోలు సమీపంలోకి రాగానే బాధితురాలుకి మెలుకువ రావడంతో ఈ ఘటన గమనించి లబోదిబోమంటూ కన్నీరు పెట్టుకుంది. కాగా బాధితురాలు అనారోగ్యం పాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.