మిస్ యూనివర్స్- ఇండియాకు అర్హత సాధించిన కుప్పం యువతి చందనకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలోని ఎంకేపురం గ్రామానికి చెందిన చందనా ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన పోటీల్లో మిస్ యూనివర్స్ ఇండియాకు ఎంపికైంది. ఈ సందర్భంగా చందన కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబును కలిశారు.