ఆళ్లగడ్డ: యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలి
ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రభుత్వ గ్రంథాలయంలో గురువారం గ్రంథాలయ వారోత్సవాలు గ్రంథాలయం అధికారిణి అరుణ కుమారి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రవి పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ జి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ గ్రంథాలయాన్ని యువతి యువకులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. 20వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు.