ఆళ్లగడ్డలో ఎస్ జి ఎఫ్ క్రీడ పోటీలు
ఆళ్లగడ్డ స్థానిక వై పి పి యం ఉన్నత పాఠశాల క్రీడ మైదానంలో ఆళ్లగడ్డ మండల స్కూల్ గేమ్స్ ఎంపిక క్రీడా పోటీలు నిర్వహించబడుతున్నాయని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీర రాఘవయ్య బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఉన్న ప్రభుత్వ, జిల్లా పరిషత్, గురుకుల, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్, ఎయిడెడ్, మరియు ప్రైవేటు పాఠశాలలు పాల్గొనవచ్చు అన్నారు.