బేతంచెర్ల: రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్
బేతంచెర్ల సీఐ వెంకటేశ్వర రావు, ఎస్ఐ రమేష్ ఆదివారం మండల పరిధిలోని గ్రామాలలో ఉన్న రౌడీ షీటర్లకు స్థానిక పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా సీఐ, ఎస్ఐ లు మాట్లాడుతూ గ్రామాలలో గానీ, పట్టణంలో గానీ ఎటువంటి అల్లర్లు స్పృష్టించినా, అసాంఘిక చర్యలకు, చట్ట వ్యతిరేక చర్యలకు, ఘర్షనలకు పాల్పడిన ఎంతటి వారినైనా ఎటువంటి విధంగా ఉపేక్షించేది ఉండదని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు.