పోలకల్లు, బ్రాహ్మణదొడ్డి మధ్య బిడ్జి నిర్మించాలి

79చూసినవారు
పోలకల్లు, బ్రాహ్మణదొడ్డి మధ్య బిడ్జి నిర్మించాలి
సి. బెళగల్ మండలంలోని పోలకల్లు, బ్రాహ్మణదొడ్డి గ్రామాల మధ్య వర్షానికి కొట్టుకుపోయిన రోడ్డును గురువారం కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఎంపీడీవో రాముడు పరిశీలించారు. ఆయా గ్రామాలకు రాకపోకలు బంద్ కావడంతో వెంటనే బిడ్జి నిర్మించాలని ఎమ్మెల్యే అధికారులకు అదేశించారు. ఎమ్మెల్యే వెంట మాజీ జడ్పీటీసీ చంద్రశేఖర్, టీడీపీ మాజీ మండల కన్వీనర్ తిమ్మప్ప, అమర్, భాస్కర్, శంకర్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్