సి. బెళగల్ లో నిలిచిన ఇసుక బుకింగ్

79చూసినవారు
సి. బెళగల్ లో నిలిచిన ఇసుక బుకింగ్
సి. బెళగల్ మండల కేంద్రమైన సి. బెళగల్ లోని సచివాలయం- 2లో ఇసుక బుకింగ్ ప్రక్రియ సోమవారం నిలిచిపోయింది. గతనెల 28వ తేదీన ఇక్కడ ఇసుక బుకింగ్ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సెలవు రోజుల్లో మాత్రమే బుకింగ్ ఉండదని చెప్పారు. అయితే వాహనదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ప్రకటన చేయకుండా సోమవారం ఇసుక బుకింగ్ ను నిలిపివేశారు. విషయం తెలియని చాలామంది దూరప్రాంతాల వారు ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సంబంధిత పోస్ట్