టిడ్కో, ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని సీపీఐ నగర కార్యదర్శి పి. రామక్రిష్ణారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, రామక్రిష్ణారెడ్డి మాట్లాడారు. పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ను జీఎస్టీ పరిదిలోకి తీసుకు రావాలన్నారు. ప్రతి కార్డుదారుడికి 14 రకాల నిత్యావసర సరుకులు అందించాలన్నారు.