గోనెగండ్ల మండలంలోని పెద్ద మర్రివీడుకు చెందిన నాగేశ్, మరియమ్మల రెండో కుమార్తె అక్షయ (2) స్పైనల్ మస్కులర్ ఆట్రోపీతో బాధపడుతోంది. ప్రాణాంతక సమస్య కావడంతో జోల్ జేరి ఏస్ఎంఏ ఇంజక్షన్ చేయాలని హైదరాబాద్ లోని వైద్యులు స్పష్టం చేసినట్లు శుక్రవారం తల్లిదండ్రులు తెలిపారు. దాని విలువ రూ. 18 కోట్లు ఉంటుందన్నారు. ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.