కౌతాళం మండలం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్ష పదవికి రాజబాబు శనివారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ మండల కమిటీ సభ్యుల సహకారంతో మండలంలోని దళితులపైన జరిగిన కుల వివక్షత, దాడులపై ఎన్నో పోరాటాలు చేశామన్నారు. మండలంలోని మాదిగ, మాదిగ ఉపకులాలలో ఎంతో చైతన్యం స్ఫూర్తిని తెచ్చి ఎంతోమంది నాయకులను కార్యకర్తలను తయారు చేశామన్నారు. ఇంతవరకు తనకు సహకరించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.