ముంబాయికి చెందిన బాలల తెలుగు భాషాభివృద్ధి సమితి నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీల్లో పెద్దకడబూరు మండలంలోని కంబదహాల్ పాఠశాలకు చెందిన
విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న ఆధ్వర్యంలో విజయ దుందుభి మోగించారు. ఒకే పాఠశాలకు చెందిన ఎనిమిది మంది
విద్యార్థులు విజేతలై పతకాలు సాధించడంతో శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.